జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ‘దేవర’ సినిమా 2024 అక్టోబర్ 10న విడుదల కానుంది. ఇందులో మరాఠీ హీరోయిన్ శ్రుతి మరాటే నటించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ HYD అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్లో జరుగుతుంది. ఇక శృతి దేవర సెట్స్‌లో అడుగుపెట్టినట్లు తెలుపుతూ ఇన్‌స్టా స్టోరీలో పెట్టింది. తన కారవాన్‌లో దిగిన సెల్ఫీని షేర్ చేస్తూ దేవర షూట్ అని తెలిపింది.
