యోగా గురువు రామ్‌దేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కంపెనీ ఉత్పత్తుల ప్రచారం, వాటి సామర్థ్యానికి సంబంధించిన ప్రకటనలో విషయంలో కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘించడంపై జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ అమనుల్లాతో కూడిన ధర్మాసనం మండిపడింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ రామ్‌దేవ్ బాబాకు, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు నోటీసులిచ్చింది.