భారతీయుల కోసం దుబాయ్ మల్టిపుల్ ఎంట్రీ ట్రావెల్ వీసాను ప్రవేశపెట్టింది. ఈ సరికొత్త విధానం ద్వారా భారతీయులు పర్యటక వీసా ద్వారా దుబాయ్‌కు ఐదేళ్ల వ్యవధిలో పలుమార్లు వెళ్లి రావచ్చు. ఒకసారి వెళితే 90 రోజులపాటు అక్కడ ఉండి రావచ్చు. ఒక ఏడాదిలో మొత్తం 180 రోజులకు మించకుండా ఉండాలి.
