UPDATES  

 జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సైన్స్ డే వేడుకలు…

 

మన్యం న్యూస్, మంగపేట.

 

ఫిబ్రవరి 28 రోజున నేషనల్ సైన్స్ డే సందర్భంగా మంగపేట మండలంలో మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ సహకారంతో కేజీబీవీ పాఠశాల మంగపేట యందు సైన్స్ డే సంబరాలు నిర్వహించడం జరిగినది.ఈ యొక్క కార్యక్రమంలో మండలంలోని అన్ని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలు, కేజీబీవీ పాఠశాల మరియు ఆదర్శ ఆర్ఎంసి పాఠశాలలు పాల్గొనడం జరిగినది. ఇందులో 196 ఎగ్జిబిట్లు 32 రంగోలి సుమారుగా 2500 మంది విద్యార్థులు ప్రతి ఎగ్జిబిట్ ను సందర్శించి వాటి యొక్క వివరాలను విద్యార్థుల చేత విద్యార్థులు తెలుసుకోవడం జరిగినది. ఈ వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించినందుకు జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ కి మండల విద్యాశాఖ కృతజ్ఞతలు తెలియజేస్తూ మండలంలోని ప్రతి విద్యార్థికి ఎంతో ఉపయోగపడే కార్యక్రమంలో నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమం గౌరవ సలహా దారులు సయ్యద్ బాబా ఆధ్వర్యంలో జరిగింది.ముఖ్య అతిథులుగా ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి జి ఫాణిని, జిల్లా సైన్స్ అధికారి అప్పాని జయదేవ్ పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసినారు. ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులలో నూతన ఉత్తేజాన్ని మరియు ప్రతి విద్యార్థి ప్రయోగాలపాటు పట్టే విధంగా ఏర్పాటు చేసినందుకు జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ కి మరియు మండల విద్యాశాఖ కి కృతజ్ఞతలు తెలియజేసినారు. ఈ కార్యక్రమాన్ని జోల చారిటబుల్ ట్రస్ట్ గౌరవ సలహాదారులు కోలగట్ల నరేష్ రెడ్డి కల్లబోయిన సురేష్,అధ్యక్షులు కోడెల నరేష్, ప్రధాన కార్యదర్శి మునిగల రాకేష్, ఉపాధ్యక్షులు పుల్లమిశెట్టి అజయ్, కార్యదర్శి ఆత్మకూరు సతీష్ కోశాధికారి కొండపర్తి నగేష్ మరియు కార్యవర్గ సభ్యులు ఇంతియాజ్ రోహిత్ ఈశ్వర్ చంద్ మిగతా సభ్యులు పాల్గొన్నారు మరియు మండల నోడల్ ఆఫీసర్ పి మేనక, జెడ్పిహెచ్ఎస్ మంగపేట, గడ్డి శ్రీనివాస్ ప్రధానోపాధ్యాయులు కమలాపురం, విజయలక్ష్మి ప్రధానోపాధ్యాయులు నరసింహ సాగర్, రావుల భాస్కర్ రావు, ప్రధానోపాధ్యాయులు జడ్పీహెచ్ఎస్ రాజుపేట చందా భద్రయ్య జెడ్పిహెచ్ఎస్ మల్లూరు ప్రధానోపాధ్యాయులు, ఆదర్శ పాఠశాల కరస్పాండెంట్ వల్లూరుపల్లి ప్రసాద్, ఆర్ఎంసి పాఠశాల ప్రిన్సిపల్ సిస్టర్ ప్రాన్సినా, మరియు ప్రతి పాఠశాల నుండి సైన్సు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగినది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !