మన్యం న్యూస్ గుండాల: మార్చి 3 తారీఖున ఖమ్మంలో జరిగే వారి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ మండల కేంద్రంలో ప్రజా పందా ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డివిజన్ కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ ఖమ్మం నగరంలో జాతీయ మహాసభలు నిర్వహించుకొని దేశంలోని బలమైన విప్లవ పార్టీగా మాస్ లైన్ నిలవబోతుందని అన్నారు. ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం న్యూ డెమోక్రసీ పార్టీ నుండి దేవల్లగూడెం గ్రామానికి చెందిన సుతారి నాగేశ్వరరావును ప్రజాపందా పార్టీలో చేర్చుకొని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు వాంకుడోత్ అజయ్, మండల కార్యదర్శి శాంతయ్య, వెంకన్న, కుమార్, మంగయ్య, రియాజ్ తదితరులు పాల్గొన్నారు