మన్యం న్యూస్ గుండాల: తునికాకు టెండర్లు వెంటనే నిర్వహించాలని గుండాల ఎంపీపీ ముక్తి సత్యం డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని ఫారెస్ట్ కార్యాలయంలో డిఆర్ఓ కు వినతి పత్రాన్ని ఇచ్చారు అనంతరం ఆయన మాట్లాడుతూ టెండర్లు నిర్వహించి తునికాకు ప్రక్రియ పనులను ప్రారంభించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఫారెస్ట్ అధికారులు కుమ్మక్కై తునికాకు టెండర్లు ఆపడం సరైనది కాదని అన్నారు. 50 ఆకుల కట్టకు ఐదు రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రామక్క, గుండాల మాజీ సర్పంచ్ సీతారాములు, పరిశిక రవి, నరేష్, వై వెంకన్న, గడ్డం లాలయ్య, బానోతు లాలు, తదితరులు పాల్గొన్నారు