మన్యం న్యూస్ గుండాల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. మండలం పరిధిలోని కొమ్ముగూడెం గ్రామానికి చెందిన వాగబోయిన సుందర్రావు మోదుగుల గూడెం గ్రామంలో పెండ్లికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో పడుగోని గూడెం గ్రామ సమీపంలో గుర్తుతెలియని వాహనం డీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి గమనించిన స్థానికులు 108 వాహనం ద్వారా గుండాల ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చి చికిత్స అందించారు మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఖమ్మం తీసుకువెళ్లారు