మన్యం న్యూస్ కరకగూడెం: కరకగూడెం మండల వైస్ ఎంపీపీగా కరకగూడెం ఎంపీటీసీ ఎలిపెద్ది శైలజ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరకగూడెం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎలక్షన్ ఆఫీసర్ సైదులు రెడ్డి, ఎంపీడీవో, వెంకటేశ్వరరావు, ఎంపీఓ కుమార్,ఎంపీపీ రేగా కాళిక ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. వైస్ ఎంపీపీ గా ఉన్న పాఠన్ అయూబ్ ఖాన్ మరణించడంతో వారి స్థానంలో వైస్ ఎంపీపీగా శైలజను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ప్రోసిడింగ్ ఆఫీసర్ సైదులు రెడ్డి తెలిపారు. అనంతరం ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. ఎంపీపీ రేగా కాళిక, ఎంపీడీవో,ఎంపీ ఓ, కార్యదర్శులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కో ఆప్షన్ సభ్యులు టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ ఎలిపెద్ది శైలజ మాట్లాడుతూ.మండల అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తానని అధికారులను సమన్వయపరుస్తూ గ్రామాలలో అభివృద్ధి జరిగే విధంగా చూస్తానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజేందర్, వారి సిబ్బంది, పంచాయతీ కార్యదర్శిలు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.