UPDATES  

 పాఠశాల సమయ పాలన పాటించని టీచర్లపై చర్యలు తీసుకోవాలి..మండలనికి నూతన ఎంఈఓ ఏర్పాటు చెయ్యాలి..

  • పాఠశాల సమయ పాలన పాటించని టీచర్లపై చర్యలు తీసుకోవాలి.
  • మండలనికి నూతన ఎంఈఓ ఏర్పాటు చెయ్యాలి
  • ఇప్పుడు ఉన్న ఎంఈఓ పాఠశాల లను తనికి చేసిన దాఖలాలు లేవు
  • సిపిఎం పార్టీ కార్యదర్శి కొమరం.కాంతారావు డిమాండ్

మన్యం న్యూస్ కరకగూడెం: మండలం లోని పలు పాఠశాలలో టీచర్లు మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారని మధ్యాహ్నం రెండు గంటలకే స్కూలు మూసివేసి ఇంటికి వెళ్తున్నారని అటువంటి టీచర్లకు ఏజెన్సీ అలవెన్సులు ఇతర అలవెన్సులు నిలిపివేసి చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొమరం కాంతారావు ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో అనంతరం పరిధిలోని పలు పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మధ్యాహ్నం రెండు,మూడు గంటలకే కొన్ని పాఠశాలలు మూసివేసారని మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో బంద్ చేస్తున్నారని ఇలా కొనసాగితే విద్యార్థులకు చదువు ఎలా వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే తల్లిదండ్రుల్లో కొంత ఆందోళన నెలకొందని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే సక్రమంగా చదువు రాదనే అపోహ ఉందని దాని మార్చటం బ్రహ్మ దేవుడు దిగివస్తే తప్ప మారుతుందా అని మండలంలో విద్యావ్యవస్థ అలా ఉందని అయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యారంగ సమస్యలపై స్పందించదు ఈ మండలానికి ఎంఈఓ ను నియమించరు అని చాలా స్కూళ్లలో ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ స్పందించే అధికారులు లేకపోవడంతో ఇలా జరుగుతుందని తీవ్రంగా దుయ్యబట్టారు.విద్యా వ్యవస్థను మార్చేందుకు అధికారులు పాఠశాలలను సందర్శించేలా పాఠశాలలపై నిఘా ఏర్పర్చాలని వారన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !