ఆలియాభట్ నిర్మాతగా తీసిన ‘పోచర్’ వెబ్ సిరీస్‌పై హీరో మహేశ్ బాబు ప్రశంసలు కురిపించారు. ‘ఎవరైనా ఇలా ఎలా చేయగలరు? మానవత్వం లేదా? వాళ్ల చేతులు వణకలేదా? క్రైమ్ థ్రిల్లర్ ‘పోచర్’ వెబ్ సిరీస్ చూసిన తర్వాత ఇలాంటి ప్రశ్నలు నా మదిలో మెదులుతూనే ఉన్నాయి. ఏనుగులను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.