గ్లోబల్ స్టార్ ప్రభాస్, యువ డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్‘ చిత్రం తాజా అప్‌డేట్ వచ్చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ మార్చి మొదటి వారంలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం కల్కి 2898AD చిత్రం షూటింగ్ లండన్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్ తర్వాత రాజాసాబ్ షూటింగ్ స్టార్ట్ కానుంది. కల్కి సినిమాని టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.