అందాల నటి తాప్సీ పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాప్సీ మార్చి నెలలో రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ లో వివాహం చేసుకోనున్నట్లు పుకార్లు వస్తున్నాయి. తాజాగా ఆమె స్పందిస్తూ ‘నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి నేను ఎప్పుడూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. భవిష్యత్తులోనూ ఇవ్వను’ అని చెప్పుకొచ్చారు.