బిగ్ బాస్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న నటి, వరుణ్ సందేశ్ సతీమణి వితికా షేరు తాజాగా ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ‘‘మా కుటుంబానికి ఎన్నో విషయాలు చెప్పిన గురువు ఇకలేరు. ఆయన మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నాము. మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఆ భగవంతుడి ఒడిలో ప్రశాంతంగా నిద్ర పోండి’’ అంటూ రాసుకొచ్చారు. కానీ అతని పేరు, ఏమవుతాడో మాత్రం వితికా చెప్పలేదు. దీంతో అభిమానులు అతని గురించి సెర్చ్ చేస్తున్నారు.