టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అభిమాన నటులు ఎవరో సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఓ వాణిజ్య ప్రకటన కోసం కొచ్చి వెళ్లిన సామ్ అక్కడ మమ్ముట్టిని కలిసింది. ఆయనతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి ‘నాకు.. అత్యంత ఇష్టమైన నటుడు’ అని పేర్కొంది. ఇక మరో పోస్ట్ లో సామ్ ఫహద్ ఫాజిల్ తో కలిసి దిగిన ఫోటోను పంచుకుంది. ఈ ఫోటోకు ‘నాకిష్టమైన మరో నటుడు’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. వీరిది, సమంతది కేరళ కావడం విశేషం.