UPDATES  

 ఎక్సైజ్ శాఖ అధికారులారా నిద్ర మత్తు వీడండి..ఇష్టానుసారమైన మద్యం ధరలను నియంత్రించండి..

  • ఎక్సైజ్ శాఖ అధికారులారా నిద్ర మత్తు వీడండి .
  •  ఇష్టానుసారమైన మద్యం ధరలను నియంత్రించండి.
  •  అధిక ధరల తో సిండికేట్ దందా కోరలు
  • చాపుతున్నాయి.
  •  బెల్ట్ షాపులలో మద్యం ఏరులై పారుతూ ఉంటే ఉలకరేమి.
  •  లైసెన్సులు వైన్ షాపులకా ?.
  •  బెల్టు షాపులకా ?
  •  జర చెప్పండి సారు.
  •  ఏరులై పారుతున్న వారి ధన దాహాన్ని ఆపండి మహాప్రభో.

 

మన్యం న్యూస్..

భద్రాచలం నియోజకవర్గం

దుమ్ముగూడెం మండలం ములకలపల్లి గ్రామంలో మద్యం ఏరులై పారుతుంది . 160 రూపాయల బీరుని 230, 250 రూపాయలకు విక్రయిస్తున్నారు. పైకి ఎమ్మార్పీ రేటుకే అమ్ముతున్నాము అని చెప్పడానికి , కొంతమేర సరుకును ఎమ్మార్పీ ధరలకే వైన్ షాపులలో విక్రయిస్తూ, మిగతా సరుకంతా వారికి అనుసంధానమైన బెల్ట్ షాపులకు తరలించి అధిక రేట్లకు విక్రయిస్తూ మందు బాబుల జేబుకు చిల్లు వేస్తున్నారు. అధిక రేట్లతో చుక్క తాగుదాం అంటే చుక్కలు చూపిస్తున్నారు అని మందు బాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నేడు కాంగ్రెస్ ప్రభుత్వం బెల్ట్ దందా లేకుండా పూర్తిగా నిషేధించే యోచనలో ఉన్న నేపద్యంలో రోజు రోజుకు అధికమవుతున్న ఈ సిండికేట్ బెల్ట్ షాపుల దందా ముదిరిపోవడంలో అంతరాయం ఏమిటి అని మండల ప్రజలు గుసగుసలాడుతున్నారు. రోడ్డు మీద వెళ్లే వారికి కూడా కనిపిస్తున్న ఈ మద్యం బెల్ట్ షాపులు ఎక్సైజ్ శాఖ వారికి మాత్రం కనపడకపోవడం విడ్డూరం . కొన్నిసార్లు వైన్ షాపులు మొత్తం మూసివేసి సరుకంతా బెల్ట్ షాపులకే తరలించి విక్రయాలు జరుపుతారు అని మొలకలపల్లి లో జోరుగా వినిపిస్తున్న పబ్లిక్ టాక్. మొత్తం మూడు వైన్ షాపులలో ఇదే తంతు నడుస్తుందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఇక చర్ల మండలంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, విజయ దుర్గ వైన్స్ తెలంగాణ వైన్స్ ఈ రెండిటితో పాటు మరోవైన్ షాపు కూడా కలగలిపి షాపులకు వచ్చే సరుకు అంతా తీసి కల్తీ చేస్తూ అమ్ముతుంటారు అని ఆరోపణలు

వినిపిస్తున్నయి.ఈ మూడు షాపులకు యజమాని భద్రాచలంలో ఉండి నడిపిస్తారని చర్ల మండల ప్రజలు తెలిపారు. ఏం జరగాలన్న భద్రాచలంలో ఉండి ఎక్సైజ్ అధికారులను సైతం వారి కనుసైగల్లో ఉంచుకొని విక్రయాలు జరుపుతూ ఉంటారని,

బెల్ట్ షాపులకు ఇచ్చే మందు అంతా వీరి సొంతంగా తయారు చేసి అమ్ముతూ ఉంటారని అనిమండల ప్రజలు చెవులు కొరు క్కుంటున్నారు. ఆ కల్తీ మందులు తాగి యువత వారి జీవితాలను అర్ధాంతరంగా కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి, అంటే ఎంత కల్తీ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు . ఇంత జరిగినా ఎక్సైజ్ అధికారులు కనీసం కన్నెత్తైనా చూడకపోవడం విమర్శలకు తావినిస్తున్నాయి.

దుమ్ముగూడెం,చర్లలో జరిగే ఈ దందాపై ఎక్సైజ్ శాఖ వారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?

బెల్ట్ దందాలో ఎక్సైజ్ అధికారులకు ఏమైనా వాటా ఉందా?

లేదా వైన్స్ యాజమాన్యాల ముడుపులు అందడం మూలాన మౌనం పాటిస్తున్నారా,

అని మండలం అంతా కొడైకొస్తుంది. జోరుగా

సాగుతున్న ఈ బెల్ట్ దందాలను ఆపే ఆలోచన కూడా లేనట్టుగా వారి నిర్లక్ష్యం పలు అనుమానాలకు కూడా తావి నీస్తున్నాయంటూ మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఈ విషయం పట్ల ఎక్సైజ్ ఉన్నత అధికారులు జోక్యం చేసుకొని ఈ కల్తీ మందు బారి నుండి అధిక ధరల విక్రయాల నుండి మండల ప్రజల్ని కాపాడి. లైసెన్స్ తో బెల్ట్ షాపులు నడిపిస్తున్నట్టుగా వారి బరితగింపు విక్రయాలకు అడ్డుకట్ట వేసి. తగినచర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !