మన్యం న్యూస్ ::
మండల పరిధిలోని చిన్న బండిరేవు గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై దుమ్ముగూడెం పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేశారు. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం మండలంలోని బండిరేవు గ్రామ శివారులో రాత్రి పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై కేశవ తన సిబ్బందితో కలిసి దాడి చేశారు.ఈ దాడిలో నలుగురిని జూదరులని పట్టుకోగా మిగతావారు పారిపోయారు పట్టుకున్న వారి వద్ద నుండి 32,030/- నగదు మూడు మోటార్ సైకిల్ మొబైల్ ఫోన్, పేకాట కార్స్ ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు దుమ్ముగూడెం సిఐ బి అశోక్ తెలిపారు.