- వైస్ ఎంపీపీగా ముత్యాల స్వాతి ఏకగ్రీవంగా ఎన్నిక
- ఎన్నికల అధికారిచే ప్రమాణ స్వీకారం
- నల్లపు దుర్గాప్రసాద్, ఆవుల విజయభాస్కర్ రెడ్డి హర్షం వ్యక్తం…
మన్యం న్యూస్ చర్ల:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం వైస్ ఎంపీపీ ఎన్నిక కార్యక్రమం ఎన్నికల అధికారి బి. సుధాకర్ రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ ఎన్నిక కార్యక్రమంలో వైస్ ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముత్యాల స్వాతిని ఏకగ్రీవంగా అన్ని పార్టీల మద్దతును ఎన్నుకోవడం జరిగింది. అనంతరం ఎన్నికల అధికారి వైస్ ఎంపీపీగా ఎన్నికైన స్వాతి తోటి ప్రమాణ స్వీకారం చేయించి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ గీత కోదండ రామయ్య మాట్లాడుతూ ఈ వైస్ ఎంపీపీ ఎన్నిక విధానం అనేది అన్ని పార్టీల కు అదే విధంగా అదే విధంగా జరిగిందని ఉన్న ఎంపీటీసీలు అందరూ ఒక తాటి మీదకు వచ్చి ముత్యాల స్వాతిని ఎన్నుకోవడం జరిగిందని ఈ విధంగానే అభివృద్ధి కార్యక్రమాలు అందరం కలిసికట్టుగా పని చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వాతిని ఎన్నుకోవడం పట్ల పార్టీ సీనియర్ నాయకులు నల్లపు దుర్గాప్రసాద్, మండల అధ్యక్షులు ఆవుల విజయ భాస్కర్ రెడ్డి, జడ్పిటిసి ఇర్ఫాశాంత హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, స్థానిక ఎంపీటీసీలు, పలు పార్టీ సీనియర్ నాయకులు నాయకులు బండారి రామకృష్ణ, జవాది రవికుమార్, భద్రం, గుండెపుడి భాస్కరరావు, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.