మన్యం న్యూస్ గుండాల: మహబూబాబాద్ పార్లమెంట్ టికెట్ అన్ని పార్టీలు ఆదివాసులకే ఇవ్వాలని తుడుం దెబ్బ పోలిట్ బ్యూరో సభ్యులు కోడెం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గతంలో ఆదివాసి ఎంపీలుగా ఎన్నికైన కమలా కుమారి, సోడె రామయ్య, మీడియం బాబురావు అక్కడున్న ఆదివాసులకి అండగా నిలిచారని అన్నారు. ఆదివాసీలను అణగదొక్కాలనే నెపంతోనే ఆనాడు పార్లమెంటు నియోజకవర్గం మహబూబాద్ కు మార్చారని అన్నారు. ఆరు లక్షలకు పైగా ఉన్న ఆదివాసీలకు కాకుండా ఇతర సామాజిక వర్గాలకు ఇవ్వడం సరైనది కాదని అన్నారు. ఆదివాసీలకు ఏ పార్టీ ఇస్తే వారిని గెలిపించుకుని పార్లమెంటుకు పంపుతామని అన్నారు. ఇప్పటికైనా అన్ని పార్టీలు ఆదివాసీలకే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు