వీల్‌చైర్ సదుపాయం కల్పించకపోవడంతో ఓ వృద్ధుడు నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలిపోయిన ఘటన ముంబై విమానాశ్రయంలో ఇటీవల చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్.. ఎయిరిండియాపై చర్యలు తీసుకుంది. విమాన సేవల్లో అలసత్వం వహించినందుకు రూ.30 లక్షల జరిమానా విధించింది.