ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులని రాజస్థాన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనను సుప్రీంకోర్టు సమర్థించింది. ఇందులో ఎలాంటి వివక్ష గానీ, రాజ్యాంగ ఉల్లంఘన గానీ లేదని తెలిపింది. కుటుంబ నియంత్రణను ప్రోత్సహించే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ నిబంధన రాజ్యాంగ ఉల్లంఘన కిందకు రాదని న్యాయస్థానం తెలిపింది.