జంతు ప్రేమికులకు పర్యావరణ మంత్రిత్వశాఖ శుభవార్త చెప్పింది. చిరుత పులుల సంఖ్యకు సంబంధించిన గణాంకాలను ఫిబ్రవరి 29న విడుదల చేసింది. గతంతో పోలిస్తే1.08 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2018లో చిరుతల సంఖ్య 12,852 ఉండగా 2022 నాటికి 13,874కు చేరినట్లు తెలుస్తుంది. 5 ఏళ్లలో 1,022 పెరిగాయని పర్యావరణ మంత్రిత్వశాఖ వెల్లడించింది.