సామాన్యులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా కేంద్రం పీఎం సూర్యఘర్ బిజిలీ అనే సరికొత్త పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకంలో దరఖాస్తు చేసుకున్నవారు ఒక కిలోవాట్ సోలార్ ప్యానళ్లకు రూ.30 వేల సబ్సిడీ పొందొచ్చు. మిగిలినది బ్యాంక్ లోన్ కల్పిస్తారు. రెండు కిలోవాట్‌లకు రూ.60వేలు, మూడు అంతకంటే ఎక్కువ కిలోవాట్లకు రూ.78 వేలు రాయితీగా ఇస్తారు. ఇందుకోసం pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.