టాలీవుడ్ స్టార్ గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న సరికొత్త చిత్రం ‘భీమా’. తాజాగా ఈ సినిమాపై గోపీచంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నా చిత్రం భీమా శివ తత్వాన్ని ఆవిష్కరిస్తుంది. సినిమాను మరో తేదీన విడుదల చేయాలని మేము ప్లాన్ చేశాము. కానీ ఇప్పుడు చిత్రం మహా శివరాత్రికి వస్తోంది. ఇది భగవంతుని ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. మీరు ట్రైలర్‌లో చూసిన దానికంటే ఈ సినిమాలో చాలా అంశాలున్నాయి. అందరూ సినిమాను ఎంజాయ్ చేస్తారు’ అన్నారు.