UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 తల్లి తండ్రులకు పాద పూజ చేసిన విద్యార్థిని విద్యార్థులు…

మన్యం న్యూస్, మణుగూరు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం,గుట్ట మల్లారం లో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో శుక్రవారం తల్లి తండ్రులకు పాద పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల తల్లిదండ్రులతో జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభం అయింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయి కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఆధునిక కాలంలో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను పెంచి పెద్దవారిని చేసి వారి అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటారు పెద్దవారైన తర్వాత తల్లిదండ్రులను విడిచి తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఒంటరిగా వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకి తల్లిదండ్రుల యొక్క శ్రమ వారి యొక్క ప్రేమానురాగాలు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ చైతన్య పాఠశాలలో నిర్వహిస్తున్నాయని తల్లిదండ్రులు ఎంత కష్టపడి శ్రమించి పిల్లల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని అన్నారు తల్లిదండ్రుల శ్రమ అర్థం చేసుకున్న పిల్లల తల్లిదండ్రుల యొక్క పాదాలని పుష్పాలతో పూజించారు పిల్లలకి తల్లిదండ్రులపై ఉన్న ప్రేమను చాటుకున్నారు కొందరు పిల్లలు తల్లిదండ్రులకు చిరు బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా తల్లిదండ్రులు పిల్లలు వారి పైన చూపించిన ప్రేమకి ఆనందభాష్పాలతో పులకరించి పోయారు. ఈ సందర్బంగా శ్రీ చైతన్య డీన్ నరేష్ మాట్లాడుతూ తల్లి తండ్రుల కు మించిన దైవం ఈ లోకంలో లేదు, తల్లి ప్రేమ స్వచ్ఛమైనది, తల్లిఎన్నో కష్టాలను ఓర్చుకోని నవ మాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బాధను మర్చి పోయింది బిడ్డ ముఖం చూసి తాను పడ్డ కష్టం అంతా మర్చి పోయి ఆనందం తో మురిసి పోతుంది. తండ్రి పిల్లలను తన బుజం పై మోస్తూ, తన ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా అహర్నిశలు శ్రమించి పిల్లల అభివృద్ధికి జీవితం ధార పోస్తాడు. తల్లి తండ్రులు దైవం కంటే ఎక్కువ, కన్పించే దైవాలు తల్లి తండ్రులే అటువంటి తల్లి తండ్రులకు పాద పూజ నిర్వహించడం పిల్లల అదృష్టం అంటూ విద్యార్థుల బాధ్యత గుర్తు చేశారు.అనంతరం ఇంచార్జి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి గొప్ప కార్యక్రమం నిర్వహించడం మా అదృష్టం, విద్యార్థుల అదృష్టం, ఇంత మంచి కార్యక్రమం లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా మీ తల్లి తండ్రులను గౌరవించి, వారి పట్ల ఆప్యాయత అనురాగాలతో ప్రవర్తన కలిగి ఉండాలి. మొదటి బడి తల్లి ఒడి, మొదటి గురువు లు తల్లి తండ్రులు, సాక్షాత్తు కన్పించే దైవం అటువంటి వారికీ ఈ రోజే కాదు రోజు వారి పాదాలకు నమస్కారం చేసి తర్వాత మీరు మీ పనుల్లో నిమగ్నం అవ్వండి అంటూ విద్యార్థుల కు హిత బోధ చేశారు. ఈ కార్యక్రమం లో విద్యార్థిని, విద్యార్థుల తల్లి తండ్రులు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !