‘అబ్రహాం ఓజ్లర్’ ఓటీటీ డేట్ ఫిక్స్ అయ్యింది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా రూ.40 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు అలరించడానికి సిద్ధమైంది. డిస్నీ+హాట్‌స్టార్‌లో మార్చి 20వ తేదీ నుంచి మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
