మన్యం న్యూస్ గుండాల: ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని గుండాల ప్రాథమిక వైద్యశాల వైద్యులు మనీష్ రెడ్డి సూచించారు. మార్చి 3 ఆదివారం మండల వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. తల్లిదండ్రులు తమ ఐదు సంవత్సరాల పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ప్రయాణంలో ఉన్నా కూడా పోలియో చుక్కలు మీ పిల్లలకు వేయించి తీసుకువెళ్లాలని అన్నారు
