మన్యం న్యూస్ గుండాల: మావోయిస్టు లారా జనజీవన స్రవంతిలో కలవాలని గుండాల ఎస్సై కిన్నెర రాజశేఖర్ కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఓ ఎస్ డి కొత్తగూడెం, ఇల్లందు డిఎస్పి, గుండాల సీఐ ఆదేశాల అనుసారం మండలంలోని పలు గ్రామాల్లో నావోయిస్టులు అజ్ఞాతం వీడాలని బ్యానర్లు కట్టామని అన్నారు. అజ్ఞాతంలో ఉండడం ద్వారా మీరు మీ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండవలసి వస్తుందని మీరు మీ కుటుంబ సభ్యులతో ఉండాలంటే తక్షణమే అజ్ఞాతాన్ని వీడాలని అన్నారు. మీకోసం మీ కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. మీరు అజ్ఞాతం వీడితే స్వేచ్ఛతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చి ఆదుకుంటుందని అన్నారు. మా వద్దకు వచ్చిన వెంటనే ఇంటికి వెళ్ళొచ్చని పునరావాసం కూడా కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ రాంబాబు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
