మన్యం న్యూస్ మంగపేట.
గతంలో ఎన్నడో రోడ్డు నిర్మించాల్సి ఉండగా గత పాలకుల నిర్లక్ష్యానికి గురై నేటికీ అదే మాదిరిగా దర్శనమిస్తున్న అక్కినేపల్లి మల్లారం గ్రామంలో ప్రధానంగా గ్రామస్తులు నడిచే రోడ్డు నేటికీ సిసి రోడ్డు నిర్మాణానికి నోచుకోలేదు. పలుమార్లు అధికారులకు రోడ్డు నిర్మించాలని విన్నవించినప్పటికి ఫలితం లేదు.చినుకులు పడితే చిత్తడి చిత్తడిగా మారి అనేకసార్లు ప్రజలు జారి క్రిందపడిన సందర్భాలెన్నో.వరదల సమయంలో నీట మునిగే రోడ్డు కావడంతో కలళ్లారా lచూసిన మంత్రి సీతక్క స్పందించి ప్రతి గ్రామానికి అత్యవసరం ఉన్నచోట రోడ్డు మంజూరులో భాగంగా అఖినేపల్లి మల్లారానికి ఒక్కటి మంజూరు చేయగా స్థానిక నాయకుడు తన కుటిల రాజకీయాలను ఉపయోగించి గ్రామంలో తన ఇంటి ముందు రోడ్డు ఏసేందుకు ఏర్పాట్లు చేస్తుండటంతో వర్షానికి మరియు గోదావరి ముంపు నీటితో మునిగిపోయి నడవడానికి వీలు లేక ఇబ్బందులు పడుతున్న వీధివాసులు ప్రశ్నిస్తున్నారు. గ్రామానికి చెందిన కార్యదర్శికి ప్రత్యేక అధికారి కూడా సమాచారం ఇవ్వకుండా గ్రామస్తుల ఆమోదం లేకుండా ఏ విధంగా రోడ్డు నిర్మిస్తారో గ్రామస్థులను ధిక్కరించి తన ఇంటి ముందు రోడ్డు నిర్మిస్తే ఏ విధంగా బిల్లు అవుతుందో తాము చూస్తామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న రోడ్డు పనులను నిలిపివేసి అత్యవసరం ఉన్న చోట రోడ్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. లీడర్ ని అని చెప్పుకుని తిరిగే వ్యక్తి గతంలో సైతం దళిత బంధు పథకం అమలులో అవకతవకలకు పాల్పడినట్లు స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.