మన్యం న్యూస్ మంగపేట
ములుగు జిల్లా మంగపేట మండలం లో విపరీతంగా గుడుంబా అమ్మకాలు జరుగుతున్న కానీ పట్టించుకోని అబ్కారి అధికారులు. ఈ సందర్బంగా ఎంఆర్పీస్ నాయకులు మాట్లాడుతూ గ్రామాల్లో పేద ప్రజలు గుడుంబా త్రాగి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు, రోజు రోజుకు యువత గుడుంబా కు ఆకర్షితులవుతున్నారు. మండలం లో మద్యం దుకాణం లేకపోవటం వలన బెల్ట్ షాపుల్లో మద్యం ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముతున్నారు. అంత రేటు పెట్టలేని పేద ప్రజలు గుడుంబా కు అలవాటు పడుతున్నారు. గుడుంబా త్రాగిన కొన్నాళ్ళకు మంచాన పడి ఎటువంటి పనిచేసే స్థితిలో లేక ఆడవాళ్ల మీద ఆధార పడుతున్నారు, మరి కొంతమంది మరణించిన సందర్భాలు ఉన్నాయి.గుడుంబా మహమ్మారి తరిమి కొట్టాల్సిన భాద్యత ప్రభుత్వ సంబందించిన అధికారులది. వెంటనే గ్రామాల్లో గుడుంబా అమ్మకాలను ఆపి వేయాలి. గుడుంబా వలన చాలా మంది తాగి మరణిస్తున్నారు. గుడుంబాకు యువతకుడా అలవాటు అవుతున్నారు.గుడుంబా అమ్మకాలనుతక్షణమే నిలిపి వేయాలి అని మంగపేట మండల ఎం ఆర్పీ ఎస్ మండల నాయకులు గుగ్గిళ్ల సురేష్ మాదిగ అబ్కారి అధికార్లను డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో ఎమ్మార్పీఎస్ మహిళలు లంజపెల్లి రమాదేవి, లంజపెల్లి నాగమణి, ఎల్లందసరి లక్ష్మి, ఎల్లందసరి సంధ్య తదితరులు పాల్గొన్నారు.