‘మెంటల్ మదిలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి నివేతా పేతురాజ్. ఇటీవల నివేతా కోసం తమిళ నటుడు ఉదయనిధి స్టాలిన్ డబ్బులు ఖర్చు పెట్టారంటూ తమిళ మీడియాలో వార్తలు వినిపించాయి. వీటిని ఆమె తీవ్రంగా ఖండించారు. ’ఒక అమ్మాయి గురించి ఇలాంటి వార్తలు రాసేముందు ఆలోచించుకోండి. జర్నలిజంలో మానవత్వం మిగిలి ఉందని, ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయరని ఆశిస్తున్నా. అందుకే లీగల్‌గా యాక్షన్ తీసుకోవడం లేదు‘ అని ఆమె పేర్కొన్నారు.
