మెగాస్టార్ చిరంజీవి హీరోగా టాలెంటెడ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ విజువల్స్ ఫాంటసీ చిత్రం “విశ్వంభర”. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ చిత్రంపై ఒక ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది. విశ్వంభరలో మెయిన్ విలన్‌గా వెర్సటైల్ నటుడు రావు రమేష్ కనిపించనున్నారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
