భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ పై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రశంసలు కురిపించారు. ‘ఉక్రెయిన్ యుద్ధం తొలినాళ్లలో ఐక్యరాజ్యసమితి సమావేశంలో జైశంకర్ మాట్లాడారు. మేమంతా ఆంక్షలు విధించిన రష్యా నుంచి చమురు ఎందుకు కొంటున్నారంటూ ఆయనను పశ్చిమ దేశాల నేతలు ప్రశ్నించారు. మీ పని మీరు చూసుకోండంటూ వారికి ఆయన జవాబిచ్చారు. ఆ తర్వాత ఆ దేశాలు కూడా మా వద్ద చమురు కొనడం ప్రారంభించాయి’ అని సెర్గీ తెలిపారు.