భారత నౌకదళం లక్షద్వీప్ దీవుల్లో వ్యూహాత్మక స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ‘ఐఎన్ఎస్ జటాయువు’ నేవీ బేస్‌ను ఇవాళ ప్రారంభించింది. లక్షద్వీప్‌లోని మినికాయ్‌లో ఏర్పాటుచేసిన రెండో నేవల్ బేస్ ‘ఐఎన్ఎస్ జటాయువు’ను నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ ప్రారంభించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో కార్యాచరణ సామర్థ్యాన్ని ఇది చాటుతుందని ఆయన తెలిపారు.