UPDATES  

 ఘనంగా మజ్జిద్ ప్రారంభోత్సవం..హాజరైన హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరులు..

మన్యం న్యూస్ చర్ల:

చర్ల మండల కేంద్రంలో నూతన మజ్జిద్ ను బుధవారం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మస్జీద్-ఎ – నూరుల్- హుదా పేరిట నూతన మస్జీద్ ను మండల ముస్లిం సహోదరులు ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవానికి వివిధ శాఖల అధికారులు,రాజకీయ నాయకులు,వర్తక వ్యాపారస్తులు, వివిధ ప్రైవేటు పాఠశాలల ప్రిన్సిపాల్ లు పుర ప్రముఖులను మసీదు కమిటీ వారు ఆహ్వానించారు. అనంతరం ప్రారంభోత్సవానికి వచ్చిన వారందరిని సాదరంగా మసీదులోకి స్వాగతం పలికారు.మజ్జిద్ ప్రారంభోత్సవం అనంతరం సభాధ్యక్షులు హజరత్ మౌలానా ముహమ్మద్ సయీద్ అహ్మద్ సహాబ్ ఖాష్మి, కార్యక్రమానికి ముఖ్య వక్తలు, హజ్రత్ మౌలానా సయ్యద్ మజ్వార్ సహాబ్ ఖాష్మి, హజరత్ మౌలానా అబ్దుల్ కరీం సహబ్ రాషాది, జనాబ్ అఫ్రోజ్ సహాబ్, ప్రారంభోత్సవ విశిష్ట అతిథి ముహమ్మద్ అబ్దుల్ లతీఫ్ ఖాన్ సాహెబ్ లు తమ ప్రసంగాలను వినిపించారు. అనంతరం అందరూ కలిసి కమిటీ వారు ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. అనంతరం ప్రారంభోత్సవానికి విచ్చేసిన తాజా, మాజీ చర్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు ను ముస్లిం మండల కమిటీ వారు సాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా కాపుల కృష్ణార్జునరావు మాట్లాడుతూ భారతదేశం అనగానే ప్రపంచవ్యాప్తంగా ఎవరికైనా గుర్తొచ్చేది భిన్నత్వంలో ఏకత్వం.ఇక్కడ ఎన్ని కులాలు,ఎన్ని మతాలు, ఎన్ని వర్గాలు ఉన్నా అంతా కలిసి మెలిసి జీవిస్తారని,ఎన్నో సంస్కృతులు,మరెన్నో సాంప్రదాయాలు ఉంటాయని, కానీ అందరూ అన్నదమ్ముల్లా జీవిస్తుంటారని ఆయన అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా, ములుగు జిల్లా నుండి ముస్లిం సహోదరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !