UPDATES  

 మాజీ మంత్రి జలగం ప్రసాద్ అద్వర్యంలో మోటర్లు, పంపుసెట్లు, స్టార్టర్లు పంపిణీ..జేవియర్ చారి ట్రబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం -ఎమ్మెల్యే జారే..

 

మన్యం న్యూస్, అశ్వారావుపేట, మార్చి 07: అశ్వారావుపేట మండలం, నారాయణ పురం గ్రామ పంచాయతీ, నెమలిపేట గ్రామం లో జలగం వెంగలరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మాజీ మంత్రి జలగం ప్రసాద్ ఆధ్వర్యంలో గిరిజన రైతులకు ఎలక్ట్రికల్ మోటార్లు, పంపుసెట్లు మరియు స్టార్టర్ల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే జారే మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జలగం వెంగళరావుని స్మరించుకుంటూ వారి పేరు మీద జేవిఆర్ ట్రస్ట్ ను స్థాపించి, ఎందరో పేద గిరిజనులకు వారి వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా బోర్లు ఉచితంగా వేపించడమే కాకుండా, మోటారు దగ్గర నుంచి స్టార్టర్ వరకు ఆ బోరు నుంచి నీరు బయటకు వచ్చేంతవరకు, ఎంతటి ఖర్చునైనా భరిస్తూ పేదవారికి సహాయం చేస్తున్నటువంటి జలగం ప్రసాద్ బాబు ని మరియు వారి కుటుంబ సభ్యులను జేవియర్ చారిటబుల్ ట్రస్ట్ ను ఎంతో అభినందిస్తూన్నట్లు ఆయన తెలిపారు. ఎందరికో స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు చేపడుతున్నందుకు ప్రసాదు బాబు కి ప్రత్యేక కృతజ్ఞతలనీ ఎమ్మెల్యే జారే అన్నారు. అలాగే ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న పేదవాళ్లకు సహాయం చేసే కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి రెవెన్యూ శాఖను, ఫారెస్ట్ డిపార్ట్మెంటును, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ను ప్రత్యేకంగా అభినందించారు. జేవిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని నియోజకవర్గ ప్రజలకు మరింత సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే జారే ప్రసాద్ బాబుని కోరారు. ఈ సందర్బంగా జలగం ప్రసాద్ బాబు ఎమ్మెల్యే జారే కి ఎలక్ట్రికల్ డిఈ కార్యాలయం మరియు ఆర్టీసీ బస్ డిపో నియోజకవర్గ కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, ఫారెస్ట్, ఎలక్ట్రికల్ మరియు వివిధ శాఖల మండల అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, గిరిజన రైతులు, చుట్టుపక్కల గ్రామస్తులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !