మన్యం న్యూస్, మంగపేట.
రాజపేట ఉన్నత పాఠశాలలో ముందస్తుగా మహిళా దినోత్సవ కార్యక్రమం జరిగింది. రాజుపేట ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రావుల భాస్కరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో రాజపేట గ్రామానికి చెందినటువంటి 20 మంది మహిళా మహిళా మణులకు పూల దండలు,శాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం ప్రధానోపాధ్యాయుడు భాస్కరరావు మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో మహిళ ఒక దిక్సూచి లాంటిదని, ఒక మంచి సలహాదారు అని, ఒక శ్రామికురాలు, మార్గదర్శకురాలుగా కుటుంబాన్ని నడిపించడంలో శక్తి యుక్తులు ఉపయోగించి కుటుంబాన్ని అన్ని రంగాల్లో ముందు ఉంచుతారని తెలియ జేశారు. ఒక కుటుంబంలో కుటుంబ సభ్యులు అంతా ఒక ఎత్తు, మహిళలు ఒక ఎత్తు. మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు హర్షిస్తారని, అందుకే మహిళలను సన్మానించడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మహిళా మణులు ఉపాధ్యాయులు జమున రాజ్యలక్ష్మి పద్మ సుజాత పావని మహాదేవి పటాన్ ఆస్మా ప్రమీల స్రవంతి సుజాత సంపూర్ణమ్మ తులసి సత్యవతి సుశీల అప్సర్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు భానోత్ బాలాజీ పాయ వీరనారాయణ గడ్డం శ్రీనివాస్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.