మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండలం రాజు పేటలో దళిత బందు సాధన సమితి మండల అధ్యక్షులు బియ్యం శ్రీను ఉపాధ్యక్షులు జయరాజు ఆధ్వర్యంలో దళిత బందు లబ్ధిదారులు రెండో విడత దళిత బందు పథకంకు ఎన్నిక అయిన లబ్ధిదారుల ఖాతలలో వెంటనే డబ్బులు జమ చేయాలని కోరుతూ నల్ల బ్యాడ్జిలు ధరించి కళ్లకు గంతలు కట్టుకొని నీరసం వ్యక్తం చేసి అంబేద్కర్ విగ్రహంకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా జీల్లా గౌరవ అధ్యక్షులు కర్రీ శ్యాంబాబు రాజమల్ల సుకు మార్ మాట్లాడుతు గత ప్రభుత్వం రెండో విడతలో విడుదల చేసిన దళిత బందు నిధులను లబ్ధిదారులు అకౌం ట్స్ లో జమ చేయాలనీ ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్న దళిత బందు లబ్ధిదా రులకు కలెక్టర్ ఖాతాలో ఉన్న 26.49 కోట్ల రూపాయలను ఎన్నికలకు ముందే జిల్లా కలెక్టర్ అకౌంట్ లో జమ చేయడం జరిగిందని కనుక గతలో విడుదలైన నిధులను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మా అకౌంట్ లలో జమ చేయలని కోరారు.ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్న దళిత బందు లబ్ధిదారులు పాల్గొ న్నారు.