మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ‘విక్రమార్కుడు’ సినిమా ఎంత పెద్ద హిట్ కొట్టిందో అందరికీ తెలుసు. ఈ సినిమా సీక్వెల్ పై నిర్మాత KK రాధా మోహన్ తాజాగా స్పందించారు. ‘భీమా’ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ. విక్రమార్కుడు 2 కథ సిద్ధంగా ఉందన్నారు. ఈ సీక్వెల్ కు హీరో రవితేజ ఆసక్తిగా లేరని, ఒప్పుకుంటే చేస్తామని చెప్పారు. ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తారని, సంపత్ దర్శకత్వం వహిస్తారని క్లారిటీ ఇచ్చారు.