మన్యం న్యూస్ చర్ల:
ఆ వీరభద్రుని చల్లని చూపుతో ప్రజలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రార్ధించారు. పాత చర్లలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఆయన శుక్రవారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మహాశివరాత్రి జాతరని పురస్కరించుకొని ప్రప్రథమంగా ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం ఆధ్వర్యంలో నెలకొల్పిన వీర ప్రభను ఆయన ప్రారంభించారు.
వీరభద్రుడు కొండంత దేవుడు అనడానికి ఈ వీరప్రభలే నిదర్శనం అన్నారు. ఆ స్వామివారి కరుణాకటాక్షాలు చర్ల మండల ప్రజలందరిపై ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యే వెంకట్రావుకి సాంప్రదాయకంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చర్ల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోయం రాజారావు, ప్రధాన కార్యదర్శి పోలిన లంకరాజు, ప్రచార కార్యదర్శి కోటేరు శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు చింతా నాగబాబు, మాజీ ఎంపీపీ సోయం కృష్ణవేణి, యూత్ అధ్యక్షుడు కాకి అనిల్, మాజీ ఎంపీటీసీ ఆలం ఈశ్వర్, యూత్ నాయకులు బోళ్ళ వినోద్, సృజన కుక్కడపు సాయి జలదాని బాలు, పార్టీ సోషల్ మీడియా ఇంచార్జీ పంజా రాజు తదితరులు పాల్గొన్నారు.