- మిషన్ భగీరథ కార్మికుల జనరల్ బాడీ సమావేశం
- మిషన్ భగీరథ కార్మికులను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి….
- ఐ ఎఫ్ టి యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మధుసూదన్ రెడ్డి
మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండల కేంద్రంలోని జిపి కాంప్లెక్స్ లో శనివారం మిషన్ భగీరథ కార్మికుల డివిజన్ వ్యాప్త జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఐ ఎఫ్ టి యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ కార్మికులు సమస్యలతో సతమతమవుతున్నారని బ్రతుకులకు భరోసా లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మిషన్ భగీరథ కార్మికుల బతుకులను ఏజెన్సీలకు తాకట్టు పెట్టి గత ప్రభుత్వo పబ్బం గడిపిందని అన్నారు. గత ప్రభుత్వం మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు మిషన్ భగీరథ కార్మికులవి ఆత్మహత్యలు కావు అవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అని నొక్కి చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం మీద కార్మికులు వారి సమస్యలు పరిష్కరిస్తుందని కోటి ఆశలతోటి ఉన్నారని ఆ ఆశలను అడియాసలు చేయకుండా గౌరవ సీఎం స్పందించాలని మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి 50 లక్షల రూపాయలు ఇచ్చి బాధిత కుటుంబాలకు భరోసా కల్పించాలని కోరారు. మిషన్ భగీరథ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు ఆత్మ ధైర్యంతో ఐక్యంగా పోరాడి హక్కులు సాధించుకోవని పిలుపునిచ్చారు 11వ తారీకు భద్రాచలం వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాముల వారి సాక్షిగా మిషన్ భగీరథ కార్మికుల సమస్యల పరిష్కారానికై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేలకు ఎంపీలకు పెండింగ్లో ఉండని జీతం కార్మికులకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎందుకు పెండింగ్లో పెడుతున్నారని ప్రశ్నించారు. కార్మికులవి కడుపులు కావా ఆ కడుపులకు ఆకలి కాదా, కార్మికులకు అవసరాలు ఉండవా కార్మికులకు కుటుంబాలు లేవా అని ప్రశ్నించారు పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని కోరారు మిషన్ భగీరథ లో ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలని జీవో నెంబర్ 60 ని అమలు చేసి స్కిల్డ్ ఆన్ స్కిల్డ్ హై స్కిల్డ్ ప్రకారం జీతాలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలి ప్రతి కార్మికుడికి బీమా సౌకర్యం కల్పించాలని మరణించిన కార్మికుల కుటుంబాలకి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి మిషన్ భగీరథ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని నేరుగా వర్కర్ అకౌంట్లోకి ప్రభుత్వం జీతం ప్రతి నెల ఒకటో తారీకు వెయ్యాలని అదనపు పని భారాన్ని తగ్గించాలని
సరిపడ అదనపు సిబ్బందిని నియమించాలని కార్మికులపై ఏజెన్సీల అధికారుల ప్రజా ప్రతినిధుల వేధింపులు ఆపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్, మేడిసుందర్,మద్ది లక్ష్మీనరసింహారెడ్డి, ముల్క నరేష్, పవన్,శ్రావణ్,రావుల కిషోర్,నీలవాస్, వినయ్, రాజేష్, నవీన్, వినోద్, సాయి, రాజేష్, కృష్ణ, కిరణ్, సుబ్బు, దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు.