మన్యం న్యూస్, మంగపేట
ములుగు జిల్లా మంగపేట మండలం బిజెపి మండల పార్టీ కార్యాలయంలో పల్నాటి సతీష్ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి బూత్ కమిటీ సమీక్షా సమావేశంలో జిల్లా నాయకులు భరతపురపు నరేష్ మాట్లాడుతూ మండలంలో 46 బూత్ కమిటీలకు 40 బూత్ కమిటీ వేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చాలా ముఖ్యమని,మార్చి 12 న హైదరాబాద్ లో బూత్ కమిటీల పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొంటారు, ఆ సమావేశం అందరూ విజయవంతం చెయ్యాలి అని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు ఎండి యాకూబ్ పాషా జిల్లా కార్యదర్శి పొదేం రవీందర్ మండల మాజీ అధ్యక్షులు ఎర్రం గారి వీరకుమార్ జిల్లా సీనియర్ నాయకులు లింగంపల్లి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు చీకట్ల యాకస్వామి, రమేష్, ప్రధాన కార్యదర్శిలు కొల్లి పూర్ణ చందర్రావు ,ఇందార ప్రతాప్, కార్యదర్శులు నిడదవోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.