టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, చాందిని చౌదరి జంటగా నటించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ‘గామి’ శుక్రవారం విడుదలైంది. యంగ్ దర్శకుడు విద్యాధర్ కాగిత తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా యూఎస్ మార్కెట్‌లో కూడా క్రేజీ ఓపెనింగ్స్‌ని అందుకుంది. ఈ చిత్రం మొదటి రోజు 9.07 కోట్ల గ్రాస్‌ని అందుకుంది. దీంతో విశ్వక్ కెరీర్‌లోనే ఇది మరో మంచి ఓపెనర్‌గా నిలిచింది.
