లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ శనివారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆమోదించారు.
అరుణ్ గోయల్ రాజీనామాకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ గెజిట్ విడుదల చేసింది.
అరుణ్ గోయెల్ లోక్ సభ ఎన్నికల సన్నాహాల్లో చురుగ్గా నిమగ్నమయ్యారు. ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పలు రాష్ట్రాల పర్యటనలు చేపట్టారు.
గోయల్ రాజీనామాతో మొత్తం ఎన్నికల యంత్రాంగాన్ని పర్యవేక్షించే బాధ్యత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌పై పడింది.
అరుణ్ గోయెల్ పంజాబ్ కేడర్‌కు చెందిన మాజీ IAS అధికారి. అతను 21 నవంబర్ 2022న అధికారికంగా ఎన్నికల కమిషనర్ పాత్రను స్వీకరించాడు. అతని పదవీకాలం 2027లో ముగియనుంది. గోయెల్ గతంలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేశారు.