44వ ‘ఫాంటస్పోర్టో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ పోర్చుగల్లోని పోర్టో వేదికగా అట్టహాసంగా జరిగింది. ఆ వేడుకలో ఉత్తమ నటుడిగా టొవినో థామస్ అవార్డు గెలుచుకున్నారు. మలయాళ చిత్రం ‘అదృశ్య జలకంగళ్’లోని నటనకుగాను ఆయనకు ఈ పురస్కారం వరించింది. ‘ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్’ (జపాన్) బెస్ట్ ఫిల్మ్, ‘ది కాంప్లెక్స్ ఫామ్స్’ (ఇటలీ) స్పెషల్ జ్యూరీ బెస్ట్ ఫిల్మ్ అవార్డులు దక్కించుకున్నాయి.
