టాలీవుడ్ హీరోయిన్ రచనా బెనర్జీ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. టీఎంసీ తరఫున హుగ్లీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమె ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఆమె పేరును టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ప్రకటించారు. హీరో చిరంజీవి నటించిన బావగారూ బాగున్నారా? సినిమాలో రచన నటించారు. అంతేకాకుండా కన్యాదానం, మావిడాకులు, సుల్తాన్, అభిషేకం, రాయుడు, లాహిరి లాహిరి లాహిరిలో వంటి సినిమాల్లో నటించారు.
