‘నా 19 ఏళ్ల సినీ కెరీర్‌లో ఇలాంటి వ్యక్తిని చూడలేదు’ అంటూ దర్శకుడు సంపత్ నందిపై ప్రముఖ హీరోయిన్ తమన్నా ప్రశంసలు కురిపించారు. టీమ్‌లోని ప్రతి ఒక్కరి ప్రతిభను గుర్తించి, మెచ్చుకోవడం ఆయనకే చెల్లిందన్నారు. తమన్నా ప్రధాన పాత్రలో డి.మధుతో కలిసి సంపత్ నిర్మిస్తున్న చిత్రం ‘ఓదెల 2’ శివరాత్రి సందర్భంగా ఈ చిత్రంలోని తమన్నా ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఆ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.
