UPDATES  

 మండల వర్కింగ్ జర్నలిస్ట్ సమావేశం విజయవంతం..

మన్యం న్యూస్, మంగపేట.

మంగపేట మండల కేంద్రం లో ఆదివారం మండల వర్కింగ్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం లో జర్నలిస్ట్ ల భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది. సమాజం లో జర్నలిస్ట్ ల పాత్ర ఎలా వుండాలి,సమాజం లో జరుగుతున్న విషయాలను ఏ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళాలి అనే విషయాలు చర్చించడం జరిగింది. జర్నలిస్ట్ ల గా ఎంతో కాలం నుండి ప్రజల కు ప్రభుత్వానికి అనుసంధానం గా ఉంటూ వార్తలు అందిస్తున్న జర్నలిస్ట్ ల సమస్యలపై చర్చ, జర్నలిస్ట్ లకు ఇంటి స్థలాలు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని ఈ సందర్బంగా కోరారు. జర్నలిస్ట్ ల సమస్యలు, అక్క్రిడేషన్ న్లకు అతీతంగా పని చేసే జర్నలిస్ట్ లను గుర్తించాలని త్వరలోనే సంబందించిన అధికారులను, జర్నలిస్ట్ నాయకులను,ప్రభుత్వ మంత్రి ని కలుస్తామని తెలియజేశారు. తదనంతరం జర్నలిస్ట్ ల ప్రెస్ స్టికర్లను ఆవిష్కరణ చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !