అమెరికాలోని లాస్ఏంజిల్స్‌లో ఆస్కార్ అవార్డు-2024 వేడుక అట్టహాసంగా జరుగుతోంది. అయితే ఆస్కార్ నామినేషన్స్‌లో ఉన్న వాళ్లలో 20 మందికి ‘డిసెంటివ్ అసెట్స్ సంస్థ’ బంపరాఫర్ ప్రకటించింది. గత 22 ఏళ్లుగా ఆస్కార్ నామినీలకు గిఫ్ట్‌లను అందిస్తోన్న ఈ సంస్థ.. ఈ ఏడాది రూ.1.4 కోట్ల విలువైన గిఫ్ట్ బ్యాగ్‌ను అందించనుంది. ఈ బ్యాగ్‌లో ఖరీదైన 50 బహుమతులు ఉండగా, అత్యంత ఖరీదైన ‘స్కీ చాలెట్’లో త్రి నైట్ స్టే కూడా ఉండటం విశేషం.





