ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సంబంధాల్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్ ఈఎఫ్‌టీఏతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి దిగుమతి అయ్యే పలు వస్తువులపై భారత్‌లో కస్టమ్స్ ట్యాక్స్‌ను క్రమంగా తొలగించనున్నారు. దీంతో పలు స్విస్ ఉత్పత్తుల ధరలు తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో రోలెక్స్, ఒమేగా, కార్టియర్ తదితర సంస్థలకు చెందిన వాచీలు, చాక్లెట్ల వంటివి తక్కువ ధరకే లభించనున్నాయి.
