- సరికొత్త విధానంతో పోయిన ఫోన్ ను కనిపెట్టిన పోలీస్ శాఖ
- మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తి కి అందజేసిన సీఐ రాజువర్మ
మన్యం న్యూస్ చర్ల:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తెగడ గ్రామానికి చెందిన మాది ప్రదీప్ అనే వ్యక్తి తన మొబైల్ ఫోన్ పోగొట్టుకుని CEIR పోర్టల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. విచారణ జరిపి మొబైల్ ఫోన్ IMEI నెంబర్ ద్వారా ప్రదీప్ కి చెందిన మొబైల్ ను కనుగొని అతనికి సోమవారం తిరిగి అప్పగించడం జరిగిందని సిఐ రాజువర్మ తెలిపారు.ఎవరైనా తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే వెంటనే CEIR పోర్టల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరిగి తమ మొబైల్ ఫోన్ ను సులభంగా తిరిగి పొందవచ్చునని ఈ సందర్భంగా సిఐ తెలియజేశారు.